కార్తికేయుని ఆలయం.. భక్తజన సందోహం | - | Sakshi
Sakshi News home page

కార్తికేయుని ఆలయం.. భక్తజన సందోహం

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

కార్తికేయుని ఆలయం.. భక్తజన సందోహం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ డీసీ మాట్లాడుతూ వివిధ సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ. 6,00,059 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కళాకారులకు ఆహ్వానం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలలో సాంస్కృతిక కళా ప్రదర్శనలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. దరఖాస్తులను సోమవారం నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు స్వీకరిస్తారన్నారు. ఒక్కో బృందానికి గరిష్టంగా ఆరుగురు కళాకారులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని, దేవస్థాన వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక, భక్తి సంగీత, నృత్య కళాప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రదర్శన తర్వాత అమ్మవారి దర్శనానికి ఆరుగురు కళాకారులను మాత్రమే అను మతిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు లలిత కళలలో డిప్లొమా, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో పాటు కళారంగంలో అనుభవం, గత ప్రదర్శన పేపర్‌ క్లిప్పింగ్స్‌, ఫొటోలను జత చేయాలని సూచించారు. అదే విధంగా ప్రధాన కళాకారుడి ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ఖాతా పాస్‌బుక్‌ మొదటి పేజీ కాపీలను జత చేయాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను దేవస్థాన కార్యాలయానికి పోస్టు ద్వారా, లేదా స్వయంగా అందజేయవచ్చని పేర్కొన్నారు. నేడు దసరా ఉత్సవాలపై సమీక్ష రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపులో తనిఖీలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) ప్రారంభమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల సమీక్ష సమావేశం సోమవారం మహామండపం నాల్గో అంతస్తులో జరగనుంది. సమీక్ష సమావేశానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వై. సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఉత్సవ ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే ఉత్సవాల ప్రత్యేక ఆహ్వాన పత్రికను మంత్రులు ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యులకు అందజేసే అవకాశం ఉంది. అలాగే ఉత్సవాలలో కీలకమైన ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ ఆదివారం రాయనపాడు వర్క్‌షాపులో విస్తృత తనిఖీలు చేపట్టారు. విజయవాడ డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా, ప్రిన్సిపల్‌ చీఫ్‌ వర్క్‌షాప్‌ ఇంజినీర్‌ డాక్టర్‌ అమిత్‌ గుప్తా, రాయనపాడు చీఫ్‌ వర్క్‌షాపు మేనేజర్‌ ఎం.త్రినాథ్‌కుమార్‌లతో కలసి వర్కుషాపులోని నిర్వహణ బేలు, ఓవర్‌హాల్‌ లైన్లు, అసెంబ్లీ విభాగాలు, వీల్‌ అండ్‌ బోగి షాపులను తనిఖీ చేసి భద్రతా చర్యలు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. నిర్ధేశించిన లక్ష్యాలు, ప్రస్తుత గణంకాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన సాంతికేక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సీటీఆర్‌బీ (కాట్రిడ్జ్‌ టేపర్డ్‌ రోలర్‌ బేరింగ్‌) ఓవర్‌హాలలింగ్‌ విభాగం, సీఎన్‌సీ ఎయిర్‌ ప్లాస్మా కటింగ్‌ మిషన్‌ను జీఎం ప్రారంభించారు. అదే విధంగా ‘స్వచ్ఛతా హీ సేవా పక్వాడ’ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించే దిశగా అధికారులతో కలసి వర్క్‌షాపు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement