ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలను సమర్పించారు. విశాఖకు చెందిన కేవీ సత్యనారాయణమూర్తి కుటుంబం రూ. లక్ష, విజయవాడ గుణదలకు చెందిన మండవ హనుమంతరావు కుటుంబ సభ్యులు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్.రమేష్‌బాబు, ఆలయ పర్యవేక్షకులు చెన్నకేశవరావులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


