లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ నెల 19, 20 తేదీల్లో కర్నూలులో జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన మౌలాలా అబ్దుల్ ఖదీర్ షుయబి, ప్రధాన కార్యదర్శిగా విజయవాడకు చెందిన మునీర్ అహ్మద్ షేక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం మునీర్ అహ్మద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలులో జరిగిన సమావేశంలో మిల్లీ కౌన్సిల్ జాతీయ సహాయ కార్యదర్శులు షేక్ నిజాముద్దీన్, మొహమ్మద్ ఆలం ఎన్నికల అధికారులుగా వ్యవహరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పలువురు సభ్యులు హాజరు కాగా, 2026–29 సంవత్సరాలకు గాను నూతన కమిటీని నియమించినట్లు తెలిపారు. దేశంలో హిందూ, ముస్లింల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించటం, విద్యా రంగాన్ని బలోపేతం చేయటం, నూరు శాతం అక్షరాస్యత సాధించటమే తమ ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని మునీర్‌అహ్మద్ షేక్ తెలిపారు. యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్ట ర్ జె.అరుణ సోమవారం తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని, ఉమ్మడి కృష్ణాజిల్లా కు సంబంధించిన అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులు తప్పక హాజరుకావాలని ఆమె కోరారు.
అబ్దుల్ ఖదీర్ షుయబి
మునీర్ అహ్మద్ షేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


