ప్రజల భద్రత, సంక్షేమానికి ఆపరేషన్‌ త్రిశూల్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రత, సంక్షేమానికి ఆపరేషన్‌ త్రిశూల్‌

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రజల భద్రత, సంక్షేమానికి ‘‘ఆపరేషన్‌ త్రిశూల్‌’’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్‌ అధ్యక్షతన, సీపీ ఎస్‌.వి.రాజశేఖరబాబుతో కలిసి ఆపరేషన్‌ త్రిశూల్‌ ప్రారంభోత్సవ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ త్రిశూల్‌లో డ్రగ్స్‌, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. డ్రగ్‌ వినియోగదారులను గుర్తించడమే కాకుండా తిరిగి వారు డ్రగ్స్‌ వైపు వెళ్లకుండా చూడటమే లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలకు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట విజిబుల్‌ పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ పెంపు, వేగవంతమైన స్పందన, రిపీట్‌ అఫెండర్లపై పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణాన్ని కూడా కోల్పోకుండా చూడడమే లక్ష్యమన్నారు. ఆపరేషన్‌ త్రిశూల్‌ సమన్వయ కమిటీ కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, ప్రతి నెలా అమలును సమీక్షించాలని కలెక్టర్‌ సూచించారు. సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ 2024–25, 2025–26 రెండేళ్ల కాలంలో జరిగిన నేరాలపై సమీక్ష చేశారు. అనంతరం త్రిశూల్‌ క్యాంపెయిన్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. త్రిశూల్‌ ప్రచార రథాన్ని ప్రారంభించి అధికారులు, సిబ్బందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. డీసీపీలు కేజీవీ సరిత, జి. రామకృష్ణ, డీఎంహెచ్‌వో ఎ.శ్రావణ్‌బాబు, ఐసీడీఎస్‌ పీడీ షేక్‌ రుక్సానా బేగం, పోలీస్‌, రవాణా, వైద్య శాఖల అధికారులు, ఈగల్‌, త్రిశూల్‌ టీమ్స్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement