మండీజ్‌ రెస్టారెంట్‌ భవన యజమానికి బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

మండీజ్‌ రెస్టారెంట్‌ భవన యజమానికి బెదిరింపులు

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

● పట్టపగలు రెస్టారెంట్‌ తాళాలు పగులగొట్టి దాడి ● అమ్మిశెట్టి సురేష్‌, మరో 15 మందితో కలిసి అద్దెకు ఉన్న వ్యక్తి దౌర్జన్యం

● పట్టపగలు రెస్టారెంట్‌ తాళాలు పగులగొట్టి దాడి ● అమ్మిశెట్టి సురేష్‌, మరో 15 మందితో కలిసి అద్దెకు ఉన్న వ్యక్తి దౌర్జన్యం

సాక్షి,టాస్క్‌ఫోర్స్‌: పట్టపగలు మండీజ్‌ రెస్టారెంట్‌ షట్టర్‌ తాళాలు పగులగొట్టి భవన యజమానిని బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడిన ఘటనవిజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. భవానీపురం క్రాంబే రోడ్డులో అట్లూరి వెంకట శశిధర్‌కు గ్రౌండ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ బిల్డింగ్‌ ఉంది. బిల్డింగ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌ను తాడేపల్లి పాతూర్‌ రోడ్‌కు చెందిన మాడసాని శ్రీనివాసరావు 2019లో అద్దెకు తీసుకుని మండీజ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశాడు. కొంత కాలం బాగానే అద్దె చెల్లిస్తూ వచ్చాడు. ఆ తర్వాత నుంచి అద్దె చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుంటే 2022లో అగ్రిమెంట్‌ రద్దు చేశారు. అయినప్పటికీ ఖాళీ చేయకుండా అలానే ఉంటూ యజమాని శశిధర్‌ను ఇబ్బందులు పెడుతున్నాడు. ఏమి అడిగినా స్పందించడం లేదు. ఖాళీ చేయమని కోరినా వినలేదు. నాలుగేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అద్దె రూ.10 లక్షలు బకాయి పడ్డాడు. దీంతో పెద్దల సమక్షంలో మే నెలలో పంచాయతీ జరిగింది. ఆగస్టు 26 నాటికి ఖాళీ చేస్తాను. అద్దె బకాయి చెల్లించలేకపోతే డబ్బుల కింద సామగ్రి వదిలేసి వెళ్లిపోతానని, షాపు స్వాధీనం చేసుకోవచ్చని ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల ఒకటో తేదీన అద్దె బకాయిలు చెల్లించకుండా సామగ్రి వదిలేసి బిల్డింగ్‌ స్వాధీనం చేసి వెళ్లిపోయాడు. ఆదివారం మధ్యాహ్న సమయంలో అమ్మిశెట్టి సురేష్‌ మరో 15 మంది యువకులను రెస్టారెంట్‌ వద్దకు తీసుకొచ్చి తాళాలు పగులగొట్టారు. అమ్మిశెట్టి సురేష్‌ భవన యజమాని శశిధర్‌ను బెదిరించాడు. దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన భవన యజమాని శశిధర్‌ 112 కాల్‌ చేసి పోలీసుల ఆశ్రయం కోరాడు. పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు అదే రోడ్డులో రెస్టారెంట్‌ ఎదురుగా చక్కర్లు కొడుతుండడంతో యజమాని శశిధర్‌ నేరుగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అద్దెకు తీసుకుని రెస్టారెంట్‌ నిర్వహించిన మాడసాని శ్రీనివాసరావు కూడా స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది. అమ్మిశెట్టి సురేష్‌ విజయవాడ జనసేన పార్టీకి నాయకుడు సోదరుడిగా చెబుతున్నారు. పట్టపగలే భవన యజమానిని బెదిరించడంతో చర్చనీయాంశంగా మారింది.

రక్షణ కల్పించండి : శశిధర్‌

బిల్డింగ్‌ యజమాని శశిధర్‌ తనకు, తన ఆస్తికి రక్షణ కల్పించాలని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బిల్డింగ్‌లో అద్దెకు ఉన్న శ్రీనివాసరావు, అమ్మిశెట్టి సురేష్‌ మరి కొందరు యువకులతో వచ్చి తనపై బెదిరింపులకు పాల్పడ్డారని, దౌర్జన్యంగా షట్టర్‌ తాళాలు పగులగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై భవానీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement