పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్‌లో రైల్వేస్టేషన్‌లు, పాఠశాలల్లో అవగాహన, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో ‘స్వచ్ఛత ఏవం జల్‌ సంచయ సంవాద్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, సుస్థిర పారిశుద్ధ్య పద్ధతులపై చర్చల్లో పాల్గొన్నారు. రోజువారీ జీవితంలో బాధ్యతాయుతమైన పర్యావరణ పద్ధతులను పాటిస్తూ ప్రతి నీటి చుక్కను సంరక్షించాలని తీర్మానం చేసుకున్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై కేంద్రియ విద్యాలయం, జాక్‌ అండ్‌ జిల్‌ స్కూల్‌లో క్విజ్‌, డిబేట్‌ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పద్ధతులపై భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛత ఒక ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందినప్పుడే దానికి అర్ధం చేకూరుతుందన్నారు. సామాజిక భాగస్వామ్యం ద్వారా పరిశుభ్రమైన స్టేషన్‌లు, నీటి సంరక్షణ, సుస్థిర భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం ప్రయాణికులకు క్లాత్‌ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement