పోషకాహార లోపంపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

పోషకాహార లోపంపై ప్రత్యేక శ్రద్ధ

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులపై ఆరోగ్య సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎ. శ్రావణ్‌బాబు అన్నారు. జిల్లాలోని ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలను నగరంలోని ఓ హోటల్‌లో గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విజయ వాహిని చారిటబుల్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను అంచనా వేయడం, ఆకలి నిర్ధారణ పరీక్ష, తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నటువంటి పిల్లలకు తక్షణమే నిర్వహించాల్సిన ఆరోగ్య పరీక్షలు గురించి వివరించారు.

పోస్టర్‌ ఆవిష్కరణ..

విజయ వాహిని చారిటబుల్‌ ఫౌండేషన్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి టి. రంగారావు మాట్లాడుతూ పోషకార లోపంతో ఉన్న పిల్లలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆరోగ్య కార్యకర్తలైన మనందరిపై ఉందన్నారు. అనంతరం కమ్యూనిటీ బేస్డ్‌ ఆధారిత పోషకార లోపం నిర్వహణ, 10 కీలక అంశాలు అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ శరత్‌బాబు, డీపీఎం డాక్టర్‌ నవీన్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేష్‌కుమార్‌, జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ జి. రేణుక తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement