బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి కె.రమేష్‌బాబు అన్నారు. యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ, బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఏకపక్ష, వివక్షపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం అఖిల భారత సమ్మెను చేపట్టారు. అందులో భాగంగా వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఐదు రోజుల బ్యాంకింగ్‌ను అమలు చేయడం, ప్రభుత్వ ఏకపక్ష పీఎల్‌ఐ పథకాన్ని ఉపసంహరించుకుని, దాని అమలును నిలిపివేయడం వంటివి ప్రధాన డిమాండ్లలో ఉన్నాయన్నారు. సంఘ అధ్యక్షుడు ఎన్‌.సుబ్బారావు వివిధ సంఘాల నేతలు జగన్‌మోహన్‌రావు, ప్రభు కిరణ్‌, గణేష్‌, పి.ఆంజనేయులు, కె.రాధాకృష్ణ, వై. శ్రీనివాసరావు, కేవీఎస్‌ రవికుమార్‌, బి.వడయవార్లు, సందీప్‌, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement