న్యూస్‌రీల్
సగానికి తగ్గిన ఐపీ, ఓపీ రోగులు ఈ–ఆస్పత్రి రికార్డులే అందుకు సాక్ష్యం వైద్య సేవలపై తీవ్రంగా జూడాల సమ్మె ప్రభావం విడనాడని ప్రభుత్వ మొండి వైఖరి
ప్రభుత్వం స్పందించాలి..
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026
విజయవాడ జీజీహెచ్‌లో దిగజారిన సేవలు
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం
10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
జగ్గయ్యపేట అర్బన్: వేదాద్రిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్‌వీ రాజశేఖరబాబు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. సూర్యభగవానుడి విగ్రహానికి అర్చకులు పూజా కార్యక్రమాలను జరిపించారు.
ఉపరాష్ట్రపతి పర్యటనకు భద్రత కట్టుదిట్టం
విమానాశ్రయం(గన్నవరం): ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన సందర్భంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) దళంతో పాటు రాష్ట్ర పోలీస్ విభాగాలు విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎయిర్‌పోర్ట్‌తో పాటు రన్‌వే పరిసర ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. విమానాశ్రయంలో ప్రోటోకాల్, భద్రత ఏర్పాట్లను ఆదివారం పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం విమానాశ్రయం నుంచి ముసునూరు వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో అధికారులు కాన్వాయ్ ప్రయాణించే మార్గాన్ని పరిశీలించి కీలక ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.35 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి 9.45 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా ముసునూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ముసునూరు నుంచి విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.35 గంటలకు చేరుకుని పది నిమిషాల అనంతరం ఉప రాష్ట్రపతి న్యూఢిల్లీ బయలుదేరనున్నారు.
పోలీసుల ఆంక్షలు..
హనుమాన్‌జంక్షన్‌రూరల్: ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో హనుమాన్‌జంక్షన్‌లో సోమవారం పోలీసులు ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హనుమాన్‌జంక్షన్ మీదగా ఏలూరు జిల్లా ముసునూరుకు ఉప రాష్ట్రపతి వెళ్తుండటంతో దారి పొడవునా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్‌జంక్షన్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో దుకాణదారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి తిరిగి వెళ్లే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ సూచనలు పాటించాలని చెప్పారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జూనియర్ వైద్యుల సమ్మెతో ప్రభుత్వాస్పత్రిలో సేవలు దిగజారాయి. ఆస్పత్రిలో అవుట్ పేషెంట్లతో పాటు, అడ్మిషన్స్ కూడా గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల్లో వచ్చే రోగుల్లో సగం మంది కూడా రావడం లేదు. అందుకు ఈ–ఆస్పత్రి వెబ్‌సైట్ నివేదికలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు తమకు 30 శాతం స్టైపెండ్ పెంచితేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెబుతుండగా, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, వారిని చర్చలకు కూడా పిలవడం లేదు. దీంతో పేదలు వైద్యానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడం లేదు.
సగానికి తగ్గిన ఓపీ, అడ్మిషన్లు..
రోగుల జేబులకు చిల్లులు..
తీవ్రమైన అనారోగ్యంతో వస్తున్న వారికి క్యాజువాలిటీలో వైద్యం చేసేందుకు గంటల పాటు వ్యవధి పడుతోంది. అది కూడా ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, ఫార్మాడీ విద్యార్థులు చికిత్స చేస్తున్నారు. ఈ నెల 21న ఏలూరుకు చెందిన ఓ మహిళ మధుమేహ దుష్ఫలితాలతో చికిత్సకోసం ఆస్పత్రికి రాగా, జూడాలు సమ్మెలో ఉన్నా రని చెప్పి పంపించేసినట్లు తెలిసింది. దీంతో ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇలా అనేక మంది నిరుపేద రోగులకు వైద్యం లేదని పంపించి వేయడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి అప్పులు పాలవుతున్నారు.
పట్టు వీడని ప్రభుత్వం..
జూడాల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం పట్టువీడటం లేదు. జూడాలు ముఖ్యంగా మూడు డిమాండ్‌లను ప్రభుత్వం ముందుంచారు. వాటిలో స్టైపెండ్ విషయంలోనే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అది కూడా జూడాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం 3 శాతం, 5 శాతం అంటూ ప్రకటనలు చేయడంపై జూడాలు మండిపడుతున్నారు. తమ సమస్యలన్నీ పరిష్కరించే వరకూ విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెబుతున్నారు.
3014
1743
10వ తేదీ ఈ–ఆస్పత్రి నివేదిక ప్రకారం ఓపీ, ఐపీ
21వ తేదీ ఈ–ఆస్పత్రి నివేదిక ప్రకారం ఓపీ, ఐపీ
స్టైపెండ్ పెంచాలని, విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని, ప్రతినెలా స్టైపెండ్‌ను సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం చేస్తున్న సమ్మెకు ప్రజారోగ్య వేదిక సంపూర్ణ మద్దతు ఇస్తోంది. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఎంతో న్యాయమైందని, ప్రస్తుతం అందుతున్న స్టైపెండ్‌పై 30 శాతం పెంపు కోరుతూ చేస్తున్న డిమాండ్ సమంజసమైనదే. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలి.
– ఎంవీ రమణయ్య,
ప్రజారోగ్య వేదిక, రాష్ట్ర అధ్యక్షుడు


