ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి

Aug 19 2026 2:11 AM | Updated on Aug 19 2026 2:11 AM

ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

మైలవరం: రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. మొర్సుమల్లి గ్రామంలో మంగళవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలకు నష్టం కలిగినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా ఎంతో కీలక మన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యమిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకోవా లని సూచించారు. ప్రకృతి వ్యసాయంపై రైతులకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సీహెచ్‌ తిరుమల దేవి, వ్యవసాయ శాఖ ఏడీ ఎం.శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి కె.సంధ్యారాణి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement