స్వామివారి సన్నిధిలో పలువురు శాసనసభ్యులు | - | Sakshi
Sakshi News home page

స్వామివారి సన్నిధిలో పలువురు శాసనసభ్యులు

Aug 19 2026 1:53 AM | Updated on Aug 19 2026 1:53 AM

స్వామివారి సన్నిధిలో పలువురు శాసనసభ్యులు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని పలువురు శాసనసభ్యులు దర్శించుకున్నారు. సాయంత్రం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వారు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివార్లకు అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement