భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు ప్రారంభం

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

u8లో

ఆశయ సాధనే అసలైన నివాళి

u8లో

మోపిదేవి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆషాఢ కృత్తిక(ఆడికృత్తిక) పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గోపూజ, సుప్రభాత సేవ, అభిషేక జల సంగ్రహణం, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణ, పంచగవ్యప్రాశన, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్టానాలు, మహా నివేదన, నీరాజన మంత్రపుష్పాలతో శాస్తోక్తంగా క్రతువులు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

స్వామివార్లకు పట్టు పవిత్రాలు..

పవిత్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో వాస్తు హోమం, పర్యగ్రీనకరణం, అంకురారోపణ, ప్రధాన దేవతా సహిత సర్వతో భద్ర మండపారాధన, పట్టు పవిత్రాలు ఆసాదన, ఆధివాసమాలు, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వినియోగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు మండలి వెంకట కృష్ణారావు ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement