పాలిసెట్ పోస్టర్ ఆవిష్కరణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన కల్పటపు శేషశాయి, అడవి రాధాకృష్ణమూర్తి, రమాదేవి, ప్రసాద్ రూ.లక్ష విరాళంగా సమర్పించారు. మంగళవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మదుసూధనరావును కలిసి విరాళం అందజేశారు. వారి కుటుంబీకులు కల్పటపు కామేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, బాల సూర్యనారాయణమూర్తి పేరిట రూ.లక్ష, కల్పటపు వీరభద్రయ్య, శేషమ్మ పేరిట రూ.లక్ష చొప్పున విరాళాలను అందజేశారు. దాతలను ఆలయ అధికారులు సత్కరించారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడి యెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 98 కేంద్రాల్లో జరీక్షలు జరిగాయి. తొలి రోజు 38,211 మంది విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాల్లో కేటాయించారు. 37,625 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 586 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధి కారి ప్రభాకరరావు పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగ లేదని ఆయన పేర్కొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని కృష్ణా జిల్లా క్రీడా ప్రాధి కార అధికారి కె.ఝాన్సీలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ.. బాలురకు పది, బాలికలకు ఆరు కిలోమీటర్ల దూరంలో మాస్ పార్టిసిపేషన్, టైమింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించామన్నారు. గన్నవరం, కంకి పాడు, గుడివాడ, గూడూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అండర్–18 విభాగంలో విజేతలుగా నిలిచిన బాలురు, బాలికలు 28 మంది ఆదివారం విజయవాడ రూరల్ మండ లంలోని నున్న వద్ద జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలి పారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.అరుణ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాలిసెట్ పోస్టర్ ఆవిష్కరణ


