లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. శాసన మండలి చైర్మన్ కె.మోషేన్‌రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జట్లుగా ఏర్పడి వాలీబాల్, కబడ్డీ, పరుగు పందెం వంటి క్రీడల్లో పాల్గొన్నారు. శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, అసెంబ్లీ కార్యదర్శి ఎస్.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
– మొగల్రాజపురం(విజయవాడ తూర్పు)


