ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

ఇంటర్

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షకు తొలి రోజు 945 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకూ ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలకు సంబంధించి 36,567 మంది హాజరుకావాల్సి ఉండగా, 35,622 మంది విద్యార్థులు హాజరయ్యారు. పోలీసు శాఖ ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు చేపట్టింది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగాయి. జిల్లాలో నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, సిట్టింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షించాయి. జిల్లాలో 36,928 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థులకు 98 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి బి.ప్రభాకరరావు తెలిపారు.

కలెక్టర్‌ పరిశీలన

నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, శారద కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ లక్ష్మీశ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.

తొలి రోజు 945 మంది

విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం 1
1/1

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement