కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ పీపీవీ మాల్ రోడ్డులో ఏర్పాటు చేసి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూమ్‌ను శ్రీకమలానంద భారతిస్వామి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అధినేత బయ్యా రవి మాట్లాడుతూ రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల ప్రజల విశేష ఆధారాభిమానాలతో విజయవాడ నగరంలో తమ నాలుగవ షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంచీపురానికి చెందిన వెయ్యిమంది వీవర్స్ తమ కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా పట్టువస్త్రాలు తయారు చేస్తున్నట్లు వివరించారు. వీవర్స్ టు కస్టమర్ అనే నినాదంతో వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.


