వాలీబాల పోటీల విజేత సచివాలయం జట్టు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ప్రత్యే క రక్షణ దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్‌మీట్ వాలీ బాల్ పోటీ లు ఆదివా రం ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం ఆరు టీమ్‌లు పాల్గొన్నాయి. సచివాలయం, ఎయిర్‌పోర్టు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోటీల్లో సచివాలయం టీమ్ విజేతగా నిలువగా, ఎయిర్‌పోర్టు జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈసందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ పి.హేమసుందరరావు, ప్రభుత్వ ముద్రణాలయం ఇన్‌చార్జి జూనియర్ మేనేజర్ నాగవరపు శరత్ మాట్లాడుతూ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగులను అభినందించారు. క్రీడలలో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని తద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. విజేతలకు రిపబ్లిక్ డే రోజున బహుమతి ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిస్టెంట్ కమాండెంట్ పీవీఎస్‌ఎన్ మల్లికార్జునరావు. ఇన్‌స్పెక్టర్లు సిహెచ్ విజయ్‌కుమార్, బి.ఫణికుమార్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.
పెడన: బీసీలు రాజ్యాధికారం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సంఘటితంగా పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ రాష్ట్ర సంఘ నాయకులు పిలుపునిచ్చారు. పెడన పట్టణంలోని తోటమాల ఫంక్షన్ హాల్‌లో కృష్ణాజిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర బీసీల గౌరవసభను నిర్వహించారు. సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు గూడవల్లి కృష్ణార్జునరావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 140పైగా ఉన్న బీసీ కులాలు రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ తదితరులు ప్రసంగించారు. హక్కులు, రిజర్వేషన్లు, సమాన అవకాశాల కోసం జరిగే సామాజిక, రాజకీయపోరాటమే బీసీ ఉద్యమ లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, సంఘ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు బొర్రా కాశీ విశ్వేశ్వరరావు(కాశీ), బెల్లంకొండ లక్ష్మణ్, వీరంకి శ్రీనివాసరావు, మట్టా వెంకటేశ్వర రావు, పార్టీ వెంకటేశ్వరరావు, కాలేపు సూరిబాబు, వేముల ప్రసాద్, మురాల ఫణి, కట్టా సతీష్, కాగిత వాసు, బెజవాడ నాగరాజు, తాతా వీరబాబు, జంపాన ఫకీర్, బళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల పోటీల విజేత సచివాలయం జట్టు
వాలీబాల పోటీల విజేత సచివాలయం జట్టు


