‘శ్రీభవిష్య’ బ్రోచర్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీభవిష్య గ్లోబల్ స్కూల్ నగర విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ సూచించారు. శ్రీభవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ యాజమాన్యం నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీభవిష్య గ్లోబల్ స్కూల్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మహాత్మాగాంధీరోడ్డులోని శ్రీశేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. గతేడాది శ్రీభవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి ఐఐటీ, నీట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈసందర్భంగా శ్రీభవిష్య డైరెక్టర్లు మాట్లాడుతూ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శ్రీ భవిష్య గ్లోబల్ స్కూల్‌లో ప్రతి విద్యార్థిని ఐఐటీ, నీట్ లాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలో విజయం సాధించేలా తీర్చిదిద్దుతుందని వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లతోపాటు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బంటుమిల్లి: మండల పరిధిలోని అర్తమూరు గ్రామం వద్ద 216 జాతీయ రహదారి మార్జిన్‌లోని వసంతరాయకోడు మైనర్ డ్రైయిన్‌లో పడి ఓవ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొర్లపాడు గ్రామానికి చెందిన వ్యయసాయ కూలీ బోడావుల నాగేంద్రం(45) తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతను రెండురోజులుగా ఇంటికి రావడంలేదు. ఈ క్రమంలో నాగేంద్రం రహదారి మార్జిన్‌లోని మైనర్ డ్రైయిన్‌లో పడి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. మద్యం తాగి రహదారి గోడపై పడుకుని ప్రమాదవశాత్తూ దొర్లి డ్రైయిన్‌లో పడి మృతిచెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఏ.గణేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం వన్‌టౌన్‌లోని సామారంగం చౌక్‌లోగల ది బెజవాడ కమర్షియల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన లేబర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్ విజయసారధి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు.అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఓ.నాగేశ్వరరావు, సెక్రటరీ కోసూరు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి డార్విన్ అధ్యక్షత వహించారు. అశోక్‌జైన్, డాక్టర్ దుర్గా నాగరాజు, జిల్లా నాయకులు అల్తాఫ్, ఎన్.సురేష్, వి. కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: అమ్మవారి రంగుల మహోత్సవం విజయవంతానికి అందరూ సహకరించాలని పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ ఈవో బి.మహేశ్వరరెడ్డి ఆదివారం కోరారు. రంగుల మహోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం 6.11గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవతామూర్తులను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, మధ్యాహ్నానానికి గ్రామంలోని రంగుల మండపం వద్దకు చేరుస్తామన్నారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత విగ్రహాలు వత్సవాయి మండలం మక్కపేట చేరుతాయన్నారు. అక్కడి నుంచి చిల్లకల్లు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు జగ్గయ్యపేటలోని రంగుల మండపానికి విగ్రహాలు చేరుతాయన్నారు. ఉత్సవం సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు ఆధ్వర్యంలో విగ్రహాల ముందు బేతాళ వేషాలు, కోలాట నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బండ్లు వెంట అంబులెన్స్, ఫైర్ ఇంజిన్‌ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఈవో కోరారు.
‘శ్రీభవిష్య’ బ్రోచర్ ఆవిష్కరణ
‘శ్రీభవిష్య’ బ్రోచర్ ఆవిష్కరణ


