సమీక్ష శూన్యం.. తూతూ మంత్రం
డ్రగ్స్ హబ్‌గా మారిన విజయవాడ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ప్రధాన సమస్యలపై చర్చే లేకుండా.. జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి అర్ధమే మార్చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ధ్వజమెత్తారు. సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రతి ఒక్కరూ తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారంతో డీఆర్సీ సమావేశానికి అర్ధం లేకుండా చేశారన్నారు. రైతులు పడుతున్న బాధలు, వారి దుస్థితి గురించి అసలు చర్చించలేదని, కేవలం అంకెల గారడీ చేశారని దుయ్యబట్టారు. ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సాధారణంగానే అన్నీ గారడీ చేస్తుంటారని, అందులో భాగంగానే ఆదోని మెడికల్ కాలేజీలో కిమ్స్ వచ్చిందని చెప్పారని, ఈ రోజు ఆ విషయం అడిగితే కిమ్స్ కాదు వేరే వచ్చిందని మాట మార్చారన్నారు. ఎన్టీఆర్ జిల్లా డీఆర్సీ సమావేశం ముగిసిన అనంతరం మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి సమస్యపై వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు జిల్లాపై అవగాహన లేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా వాటి గురించి డీఆర్సీలో చర్చించకుండా తూతూ మంత్రంగా ముగించారని మండిపడ్డారు. వారి మాటల్లో...
● ఎన్టీఆర్ జిల్లాలో ప్రధాన సమస్యలు, రైతులు పడుతున్న బాధలను చర్చించకుండానే సమావేశం ముగించేశారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. పత్తి, మిరప, మొక్కజొన్న ధరలకు సంబంధించి ఒక్కొక్కటి మేం అడుగుతుంటే అధికారులు ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే వారి ప్రస్తావన లేకుండా డీఆర్సీ ముగిసింది.
● రాష్ట్రంలో, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా డయేరియా బాధితులు ఎక్కువగా ఉంటే వారి గురించి చర్చ లేకుండా పోయింది. ఎ.కొండూరులో అనేక మంది కిడ్నీ బాధితులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడ ఆర్‌ఆర్ పేటలో డయేరియా బారిన పడడానికి అధికారులు చెప్పే కారణాలు వాస్తవ దూరంగా ఉన్నాయి.
● ఇసుక హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు అక్రమ రవాణా గురించిన చర్చ లేదు. అధికారులు, నాయకులు కుమ్మకై ్క ఎన్టీఆర్ జిల్లాను దోచుకుంటున్నారు.
● ఎంఎస్‌ఎంఈ కింద కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కేటాయించిన భూమి, కల్పించిన ఉద్యోగాలు, వచ్చిన ఇండస్ట్రియల్ పార్క్‌లు, భూమి ఎవరెవరికి కేటాయించారన్న సమాచారం అడిగితే కలెక్టర్ పొంతన లేని సమాధానం ఇచ్చారు.
● ఎన్నెస్పీ కాలువలకు మరమ్మతులు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు, వ్యవసాయం, పండించిన పంటలు. పరిశ్రమలు, ఆరోగ్యం దేని గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రైతుల ఆత్మహత్యల ప్రస్తావనే లేదు
డీఆర్సీ మీటింగ్ అర్ధం మార్చేశారు
తప్పుడు సమాచారం, అంకెల గారడీతో
గంటలోనే ముగించారు
విజయవాడ డ్రగ్స్ హబ్‌గా మారింది
అధికారులు, నాయకులు
కుమ్మకై ్క దోచుకుంటున్నారు
డీఆర్సీ సమావేశం జరిగిన తీరుపై
మండిపడ్డ ఎమ్మెల్సీలు అరుణ్‌కుమార్,
రుహుల్లా
లా అండ్ ఆర్డర్ విషయంలో జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని డీఆర్సీలో గొప్పలు చెప్పారు. కానీ వాస్తవానికి ఈ ప్రభుత్వంలో విజయవాడ డ్రగ్స్ హబ్ గా మారింది. గంజాయికి విజయవాడ ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. యువత గంజాయి మత్తులో తూగుతుంటే అధికారులు మాత్రం గంజాయి లేకుండా చేశామని చెప్పడం విడ్డూరంగా ఉంది. గంజాయి, మత్తుపదార్ధాలు, నార్కొటిక్స్, ఎండీఎం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అధికార పార్టీ అనుకూల పత్రికలే రాస్తున్నాయి.


