జాతీయ స్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్‌కు ఎంపికై న సోదరుల
గన్నవరం: చనుపల్లివారి గూడెంకు చెందిన ఇద్దరు సోదరులు జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌డీ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వేల్పుల దిలీప్, సందీప్‌లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. నాగపూర్‌లో జనవరి 19 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరిద్దరూ రాష్ట్ర జట్టుకు ప్రాతి నిధ్యం వహించనున్నారు. దిలీప్, సందీప్‌లను నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు, పలు సంఘాల ప్రతినిధులు అభినందించారు.
దిలీప్ సందీప్
జాతీయ స్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్‌కు ఎంపికై న సోదరుల


