హోరాహోరీగా జాతీయ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): 87వ యునెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2025లో భాగంగా శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. నగరంలోని పటమటలో ఉన్న చెన్నుపాటిరామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో, గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి.
ఉమెన్స్ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన వినీల, రష్మిక–21–16, 21–13తో విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భార్గవ్ రామ్, విశ్వ తేజ–21–7, 21–13 స్కోర్‌తో చత్తీస్‌ఘడ్‌కు చెందిన అభిషేక్, సుజైన్‌పై గెలుపొందారు. ఉమెన్స్ సింగిల్స్‌లో ఏపీకి చెందిన సూర్య చరిష్మ 21–12, 21–15తో హర్యానాకు చెందిన ఉన్నతి హుడాపై గెలుపొందింది. తెలంగాణకు చెందిన రక్షితశ్రీ 16–21, 21–14, 21–18 స్కోర్‌తో పంజాబ్‌కు చెందిన తవ్వి శర్మపై విజయం సాధించింది. మెన్స్ సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు ఎం.తరుణ్ 21–13, 22–20 స్కోర్‌తో హర్యానాకు చెందిన మన్‌రాజ్ సింగ్‌పై విజయం సాధించాడు.
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో పీఎస్‌బీ క్రీడాకారుడు తరుణ్ విన్యాసం
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్
విజేత రైల్వే క్రీడాకారుల ఆటలో ఒక కీలక ఘట్టం
హోరాహోరీగా జాతీయ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్
హోరాహోరీగా జాతీయ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్


