సీఐ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పరకామణి కేసులో సాక్షిగా ఉన్న సీఐ సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అనుమానాలు వ్యక్తం చేశారు. సతీష్‌కుమార్ మృతిపై ప్రత్యేక సిట్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఐ సతీష్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ.. సీఐ సతీష్ కుమార్ హత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పరకామణి ఘటనలో సాక్షిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన సతీష్‌కుమార్ మృతిపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై త్వరలోనే డీజీపీని కలిసి నిందితులను శిక్షించాలని కోరతామన్నారు. సతీష్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.వి ఎస్.ఎన్ మూర్తి, రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు లంక వెంకటేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, వి.వి.రావు, పి.సతీష్, సోము మహేష్, చందు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు


