28,29 తేదీల్లో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 28,29 తేదీల్లో రాజమహేంద్రవరంలోని అంబేడ్కర్ భవన్‌లో జరుగుతాయని యూనియన్ జాతీయ కన్వీనర్ ఎం.రామ కృష్ణ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో మహాసభల వాల్ పోస్టర్లపే ఆయన మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాసభలను ప్రొఫెసర్ టి.సత్యనారాయణ ప్రారంభిస్తారని తెలి పారు. విద్యారంగం శాస్త్రియ దృక్పథంపై ఏపీ విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్ డి.రమేష్ పట్నాయక్, జాతీయోద్యమంలో – విద్యార్థుల పాత్రపై సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు పి.టాన్యా, విద్యారంగం సవాళ్లు – విద్యార్థుల కర్తవ్యాలపై తన ప్రసంగ పాఠాలు ఉంటా యని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయలేదన్నారు. సంక్షేమ హాస్టల్లో చదు వుతున్న విద్యార్థులు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ అంటే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని పేర్కొన్నారు. విద్యారంగ సంక్షోభంపై చర్చించి భవిష్యత్ కర్తవ్యలు రూపొందించడానికి జరిగే మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్ర మంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు ఆర్.వేణు, పి.వైష్ణవ్, కె.హేమ, మణికంఠ, భాను, రవిశంకర్, ఆసియా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


