
విద్యుత్ షాక్‌తో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి
వీరులపాడు: విద్యుదాఘాతంతో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని జయంతి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు... గ్రామానికి చెందిన వల్లబోయిన గోపి (32) ప్రొక్లెయిన్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం గ్రామ శివారులోని వ్యవసాయ పనులు ముగించుకుని ప్రొక్లెయిన్‌ను లారీపై ఎక్కించి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీ వద్దకు వచ్చే సరికి 11 కెవీ విద్యుత్ తీగలు ప్రొక్లెయిన్‌కు అడ్డురావటంతో తప్పించబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.