
విద్యతోనే జ్ఞాన సముపార్జన
గుడ్లవల్లేరు: ఆకాశమే హద్దుగా విద్యార్థులు జ్ఞాన సముపార్జనకే విద్య అభ్యసించాలని స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ జి.వి.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు 17వ స్మారక అవార్డుల ప్రదానోత్సవం బుధవారం నిర్వహించారు. గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్. పాలిటెక్నిక్ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ అవార్డులను సాంకేతిక విద్యామండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారన్నారు. విద్యా విధానంలో మార్కులకు ప్రాతిపదికగా కాకుండా నైపుణ్యాలను పెంపొందించే దిశగా పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొనే దిశగా అడుగులువేస్తున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను అందించటంలో లాభాపేక్ష లేని ఒక విద్యా వ్యవస్థను స్థాపించడంలో దివంగత వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎమ్ అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆలూరి లలిత కోమలికు రూ.10వేల విలువైన బంగారు పతకాన్ని, రూ.10వేల నగదును, డి.టి.ఇ ధ్రువీకరించిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ద్వితీయ ర్యాంకు సాధించినందుకు గాను శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ – టెక్నాలజీ నందమూరు పాలిటెక్నిక్‌కు చెందిన విద్యార్థిని అంకెం అఖిలా దేవికి రూ.5ల విలువగల బంగారు పతకాన్ని, రూ.5 వేల నగదును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కాలేజీ ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు, గారు, కో– కరెస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ తదితనేఏ పాల్గొన్నారు.
స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సత్యనారాయణమూర్తి