
గిరిజనుల ఆలోచన విధానం మారాలి
నాగాయలంక: ఆదివాసీల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా నాబార్డు అందిస్తున్న భూమి ఆధారిత ఉపాధి అవకాశాల కంటే భిన్నంగా నాగాయలంక ‘యానాది గిరిజన సంఘం జీవావరణ వ్యవస్థ ఆధారిత జీవనోపాధి మెరుగుదల’ ప్రాజెక్ట్ చేపట్టడం ఆనందదాయకంగా ఉందని నాబార్డు డీఎండీ అజయ్‌కుమార్ సూద్ పేర్కొన్నారు. శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్‌లోని ఫుడ్‌కోర్టు భవనంలో మంగళవారం సంఘం అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. చేపలు పట్టడం, కేజ్ కల్చర్ లాంటి సముద్రం, నదీ జలాల ఆధారిత కార్యక్రమంగా ఈ ప్రాజెక్టు మొదటిదని ఆయన పేర్కొంటూ మారుతున్న సామాజిక పరిణామాలకు దీటుగా ఆదివాసీ యానాదులు ఆలోచనా విధానాలను మార్చుకొని జీవన ప్రమాణాల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు.
25మందికి రూ. 12.75లక్షల విలువైన..
ఈ సందర్భంగా లబ్ధిదారులైన పలువురు గిరిజనులు తమ అనుభవాలను డీఎండీతో పంచుకున్నారు. తదుపరి ఎన్‌జీఓ ఆధ్వర్యంలో నాబార్డు–ట్రైబల్ డెవలెప్‌మెంట్ ఫండ్ ఆర్థిక సహకారంతో నాగాయలంక మండలంలోని మర్రిపాలెం, కమ్మనమోలు, సంగమేశ్వరం గ్రామాలకు చెందిన 25 మంది ఎస్‌టీ లబ్ధిదారులకు రూ.12.75లక్షల విలువైన అయిదు బోట్లు, ఐస్ బాక్స్‌లను డీఎండీ అందజేశారు. కార్యక్రమంలో నాబార్డు ఏపీఆర్‌ఓ సీజీఎం ఎం.రామ్‌గోపాల్, జీఎంలు కేవీఎస్ ప్రసాద్, ఎంపీ పహడ్‌సింగ్, కేడీసీసీబీ సీఈఓ ఎ.శ్యామ్ మనోహర్, పీపీఎస్‌ఎస్ కోఆర్డినేటర్ నక్కా విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
నాబార్డు డీఎండీ అజయ్‌కుమార్ సూద్