
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకం, బంగారు గోపురం పనులకు భక్తులు విరాళాలను అందించారు. అమ్మవారి నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన ఎం.శ్రీనివాసరావు కుటుంబం రూ.1,01,116, హైదరాబాద్‌కు చెందిన కె.విష్ణువర్ధనదేవి రూ.లక్ష హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు వి.శ్రీనివాస్ రూ. 1,01,116 విరాళాన్ని అందించారు.
బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన డి.రామాంజనేయులు రూ.1,51,116, విశాఖపట్నంకు చెందిన కె.బాలకృష్ణారావు కుటుంబం రూ.లక్ష అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేష
వస్త్రాలతో సత్కరించారు.