టీటీఏ సేవా డేస్.. గజ్వేల్ లో ట్రై సైకిల్ లు పంపిణీ | TTA Seva Days Distribution Of Tricycles In Gajwel | Sakshi
Sakshi News home page

టీటీఏ సేవా డేస్.. గజ్వేల్ లో ట్రై సైకిల్ లు పంపిణీ

Dec 17 2023 9:01 AM | Updated on Dec 17 2023 9:01 AM

TTA Seva Days Distribution Of Tricycles In Gajwel - Sakshi

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ సేవా డేస్‌లో భాగంగా ఐదవ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన టీటీఏ బృందం.. గజ్వేల్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిల్ లు పంపిణీ చేశారు. సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి, విజేంద్ర భాష, రోటరి క్లబ్ ఖమ్మంతో వారి సహాయంతో పాటు దాతాల సహకారంతో ట్రై సైకిల్, వీల్ చైర్‌లు పంపిణీ చేసినట్లు టీటీఏ టీమ్ తెలిపింది.

అలాగే అవసరమైన వారికి కృత్రిమ అవయవాలకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సహాకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీఏ చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలను పలువురు కొనియడారు.

(చదవండి: అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement