మేలో తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ సదస్సు | Telangana Telugu Association Convention Will Be Held In 2022 May | Sakshi
Sakshi News home page

మేలో తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ సదస్సు

Mar 16 2022 10:07 AM | Updated on Mar 16 2022 1:22 PM

 Telangana Telugu Association Convention Will Be Held In 2022 May  - Sakshi

ఉత్తర అమెరికాలోని కెనడా, అమెరికా దేశాలలో ప్రసిద్ధిగాంచిన ప్రవాస భారతీయుల సంస్థ  తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) భారీ వేడుకలకు సిద్ధమైంది. అందులో భాగం సన్నాహక సమావేశాలను విస్త్రృతంగా నిర్వహిస్తోంది. ప్రవాస భారతీయులకు ఇమిగ్రేషన్, ఐటి ట్రేనింగ్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, తెలుగు రాష్ట్రాలలో ఎంబ్యులెన్స్ సేవలతోపాటు మురెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మాతృభూమికై టీటీఏ నేతృత్వంలో అమెరికాలోని తెలుగువారికి తమవంతు సేవలను అందిస్తున్నారు. 

2022 మే 27, 28, 29వ తేదీలలో కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అమెరికాలోనే మొట్టమొదటిసారి టీటీఏ సాంస్కృతిక మెగా కన్వెన్షన్ నిర్వహించనుంది. ఈ మెగా కన్వెన్షన్ సన్నాహాకాల్లో భాగంగా మార్చి 12, 13వ తేదీలలో టీటీఏ నాయకత్వ బృందం టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్, డల్లాస్ నగరాల్లోని తెలుగు వారితో కలిసి కన్వెన్షన్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement