Sri Rama Navami 2023 Celebrations In UK, London, And Other Cities - Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు, శ్రీరామకోటికి సహకారం

Apr 7 2023 12:30 PM | Updated on Apr 7 2023 1:19 PM

Sri Rama Navami celebrations in UK London and other cities - Sakshi

లండన్‌: యునైటెడ్ కింగ్డమ్ లండన్ ,  ఇతర నగరాలలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంతకుమునుపు మరెప్పుడూ లేని రీతిలో ప్రవాస భారతీయులు, ఎన్నారైలు ఒక మహత్ కార్యాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు - శ్రీరామ కోటి రాసే కార్యక్రమానికి పట్టం కట్టారు. వందలాది భక్తులు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ శ్రీరామ కోటి రాసే మహా యజ్ఞంలో ఎంతో ఉత్సంగా, ఆనందంగా పాల్గొన్నారు.

శ్రీరాముడి భద్రాచల క్షేత్రం నుంచి ఆలయ కమిటీ ఏఈఓ (AEO) శ్రీ శ్రవణ్ గారి సహకారంతో, గౌతమ్ గారి సహకారంతో రామకోటి పుస్తకాలు, ముత్యాల తలంబ్రాలు, పసుపు-కుంకుమ, లడ్డు ప్రసాదం, కండువలు, రామమాడ అన్నీ శ్రీ రామకోటి రాసిన భక్తులకి ఇవ్వడం జరిగింది. వీటిని ప్రసాదంగా అందుకున్న భక్తులు ఆనంద శిఖరాలను చూశారు ఈ కార్యక్రమన్ని చేపట్టిన శ్రీ సంతోష్ కుమార్, లావణ్య బచ్చు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో శ్రీరామ కోటి రాయడం అనేది వృద్దులకు, పెద్ద వాళ్లకు మాత్రమే సంబంధించింది అన్నట్టుగా అయిపోయింది, కానీ, శ్రీ రామకోటి రక్ష మనందరికీ అవసరమని, ముఖ్యంగా రాబోయే తరానికి దీన్ని  ప్రాముఖ్యతను తెలుపుతూ, వారికి అందింంచాల్సిన బాధ్యత మనదని, అందుకు అనుగుణంగా భద్రాచలం నుంచి ప్రసాదాలు తెప్పించి  లండన్,  రీడింగ్,  అమెర్షం,  ఇతర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరామ కోటి రాయించే కార్యక్రమాన్ని చేపట్టామని ఉచితంగా వీటిని ఇస్తున్నట్టు వివరించారు.

ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సహకరించిన కార్యవర్గ సభ్యులను అభినందించారు. యూకేలోనే కాకుండా ప్రపంచం నలుమూలల శ్రీరామ కోటి రాయించే కార్యక్రమాన్ని విస్తరించాలని కోరారు. ఎవరికైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా, సహకారం కావాలన్నా,  బీఎస్‌కుమార్‌.కాంటాక్ట్‌ అనే జిమెయిల్‌ అడ్రస్‌ను సంప్రదించవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement