
సింగపూర్: స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 ఆధ్వర్యంలో తెలుగు సంఘానికి ప్రత్యేకంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడపా, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ భరద్వాజ్, తెలుగు సమాజం నుంచి నాగేశ్ టేకూరి మద్దతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబార కార్యాలయం నుంచి VSR కృష్ణ, సన్యమ్ జోషి భాగస్వామ్యం మరో ప్రత్యేకత.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 40 జట్లు తమ ప్రతిభను చాటుకున్నాయి. ప్రారంభ రౌండ్లు రౌండ్-రాబిన్ లీగ్ తరహాలో నిర్వహించగా, అనంతరం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుండి నాక్అవుట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. తుదిపోరులో అనూప్- విజయ్ జంట విజేతలుగా నిలిచింది. నిర్వాహకులు ద్వారకానాద్ మిట్టా, నవీన్ మల్లం, మహేశ్వర చౌదరి కాకర్ల, సాయి కృష్ణ సేలం, రమేష్ గోర్తి, ఉమామహేశ్వర రావు తెళదేవర, వెమ్మెసెన కులశేఖర్ రీగన్, ప్రసాద్, చంద్రబాబు జొన్నారెడ్డి, విశ్వనాథ్ తదితరులు ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

క్రీడా స్పూర్తిని, సాంఘిక సమైక్యతను,సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్ సాగింది. ఖచ్చితమైన ప్రణాళిక, స్నేహపూర్వక పోటీలు, ఉత్సాహభరిత వాతావరణంతో ఈ కార్యక్రమం అందరి మెప్పు పొందింది. స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన ఆటగాళ్లు, స్వచ్ఛంద సేవకులు, ప్రోత్సాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ముఖ్యంగా వీరా ఫ్లేవర్స్, సరిగమ, కుంభకర్ణ, ఫ్లింటెక్స్ కన్సల్టింగ్, ERA, ఈస్ట్ కోస్ట్ ఫిజియోథెరపీ సంస్థల సహకారం ఈ టోర్నమెంట్‌కు బలాన్ని చేకూర్చిందని నిర్వాహకులు తెలిపారు.