డల్లాస్‌లో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిన నాట్స్ | NATS Conducted Special Vaccine Drive In Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిన నాట్స్

Nov 8 2021 2:14 PM | Updated on Nov 8 2021 2:36 PM

NATS Conducted Special Vaccine Drive In Dallas - Sakshi

డల్లాస్,టెక్సాస్: అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగువారి కోసం ఉచితవ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. నాట్స్ డల్లాస్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డల్లాస్‌లో దాదాపు 500 మందికిపైగా తెలుగు చిన్నారులకు వ్యాక్సిన్స్ వేశారు. ఇందులో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ అందించారు. ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న పెద్దలకు బూస్టర్ డోస్ ఇచ్చారు. గ్రేట్ ఫార్మసీ, ఇండిపెండెన్స్  ఫార్మసీల సహకారంతో నాట్స్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. 

నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్, వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, బోర్డ్ డైరెక్టర్స్  కిషోర్‌ వీరరగంధం, ఆది గెల్లి, కిషోర్ కంచర్ల, ప్రేమ్ కుమార్ లతో పాటు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చాప్టర్ కోఆర్డినేటర్‌ రాజేంద్ర  కాట్రగడ్డ, రాజేంద్ర యనమల తదితర స్థానిక డల్లాస్‌  నాట్స్ విభాగ నాయకులంతా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వ్యాక్సిన్ వేయించుకున్న వారంతా నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపైప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని టెక్సాస్ చాప్టర్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement