యూకేలో కౌన్సిల‌ర్‌గా ఎన్నికైన తెలుగు వ్యక్తి మువ్వల చంద్రశేఖర్

Muvvala Chandrasekhar was elected as a councilor in UK - Sakshi

ఇటీవల జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో లండన్ నగరంలో గల 'స్లో బరో' లోని లాంగ్లే మేరీస్ వార్డు నుంచి అందరు తెలుగు వ్యక్తులు గర్వపడేలా రెండవసారి అత్యధిక మెజారితో 'మువ్వల చంద్రశేఖర్' గెలుపొందారు. 

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బ్రిటన్ ప్రధాన మంత్రి 'రిషి సునాక్' నేతృత్వం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నుంచి బంపర్ మెజారితో గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతే కాకుండా నా గెలుపుకి సహకరించిన యూకేలోని తెలుగువారందరికీ ఎల్లవేళలా ఋణపడి ఉంటానని పేర్కొన్నారు.

లాంగ్లే మేరీస్ వార్డులో ఉన్న వివిధ దేశాలవారందరికీ తనవంతు సహకారం అందించి, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో నేను వార్డు సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని గుర్తించి మళ్ళీ అవకాశం కల్పించినందుకు తప్పకుండా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు.

థేమ్స్ నదీ తీరాన ఒక తెలుగు బిడ్డగా గెలుపొందడం నాకు గర్వంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆప్యాయమైన స్నేహం, మంచి పలకరింపు తనం తన సొంతమని తోటి స్నేహితుడు, తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ అడ్వైజరీ చైర్మన్ వెంటెద్దు మట్టారెడ్డి అన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top