3 లక్షల విలువైన ఫుడ్‌ అందజేత

Food Drive 2020 For the Homeless People in Austin, Texas And USA - Sakshi

కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకొచ్చింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చిన్నచిన్న వ్యాపారాలు మూతబడ్డాయి.  దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుంటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అలాంటివారికి రోజుగడవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా హోమ్‌లెస్, జాబ్ లెస్ వారి కుటుంబాల కోసం లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ Food Drive - 2020ను నిర్వహించారు.  ఆస్టిన్, టెక్సాస్, అమెరికాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాస భారతీయులు పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డిలు తమకు చేతనైనంత సహాయం చేస్తూ హ్యూమన్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. తమ సంస్థ సేవలు కేవలం అమెరికాకే పరిమితం అవ్వకుండా, ఇండియా, ఇతర దేశాలలో కూడా అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 18, 2020న మూడు లక్షల రూపాయల(3,00,000) విలువ చేసే ఆహార పదార్థాలను "సెంట్రల్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు" వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్స్ పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డి మరియు అడ్వైసరి కౌన్సిల్ మెంబెర్స్, శ్రీకాంత్ రెడ్డి చేగిరెడ్డి, వినోద్ రెడ్డి దువ్వూరు, సతీష్ యెన్న, దుశ్యంత్ రెడ్డి వంగల, శివ దుర్భకుల తదితరులు హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించడానికి సహాయసహకారాలందించిన దాతలకి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు రానున్న సంవత్సరంలో ప్రణాళికతో  అందరిని కలుపుకొంటూ సేవలందించడమే తమ ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ ఫౌండర్స్ తెలియజేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top