స్విట్జర్లాండ్‌లో భారత సంస్కృతి ఉట్టి పడేలా.. | The Diwali Celebrations Were Organized By Telugu Association Switzerland | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌లో భారత సంస్కృతి ఉట్టి పడేలా..

Published Sat, Nov 27 2021 4:59 PM | Last Updated on Sat, Nov 27 2021 5:12 PM

The Diwali Celebrations Were Organized By Telugu Association Switzerland - Sakshi

జ్యూరిచ్‌: స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన తెలుగు ప్రజలు భారత సంస్కృతి ఉట్టి పడేలా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2021 నవంబర్  21న  తెలుగు అసోసియేషన్  స్విట్జర్లాండ్ సీహెచ్‌ ఆ‍ధ్వర్యంలో జ్యూరీచ్లో  దీపావళి  వేడుకలను  అంగ రంగ వైభవంగా జరిగాయి. వేడుకను తెలుగు అసోసియేషన్  స్విటర్లాండ్ ప్రెసిడెంట్  కడలి  గనికాంబ,  జనరల్  సెక్రెటరీ కిషోర్  తాటికొండలతో పాటు ఇతర  తెలుగు అసోసియేషన్ సభ్యులు సహకారం అందించారు.  

దీపావళిని పురస్కరించుకుని సాంస్కృతిక  కార్యక్రమాలు ఆట  పాటలతో  కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన  150మంది  తెలుగు వారు ఈ వేడుకలలో  పాల్గొన్నారు. పిల్లలతో సహా అంతా అందరూ వెలిగించిన కాకర పువ్వులు, చిచ్చుబుడ్డులతో ఆ ప్రాంగణమంతా దీపాకాంతులతో వెల్లివిరిసింది. శుభోదయం  గ్రూప్  ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement