సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Bathukamma Festival 2023 Celebrations Held In Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published Fri, Oct 20 2023 11:53 AM | Last Updated on Fri, Oct 20 2023 11:55 AM

Bathukamma Festival 2023 Celebrations Held In Singapore - Sakshi

తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సింగపూర్‌ ఆధ్వర్యంలో సింగపూర్‌ బతుకమ్మ2023 పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబవాంగ్ పార్క్‌లో ఈ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో తెలుగు వాళ్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా బతుకమ్మ, బోనాలు జరుపుకోవడం ఎంతో అభినందనీయని సింగపూర్‌ కల్చరల్‌ సొసైటీ సభ్యులు అన్నారు.

తెలంగాణ సాంప్రదాయ పండగలను అందరితో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా ఉన్న వాళ్లకు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement