న్యూజీలాండ్‌లో జరగనున్న 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

8th World Telugu Literature Conference to be held in New Zealand - Sakshi

ఆక్లాండ్ (న్యూజీలాండ్):  8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆక్లాండ్ (న్యూజీలాండ్) కేంద్రంగా అంగరంగ వైభవంగా జరగనుంది. సెప్టెంబర్ 17-18, అక్టోబర్ 2, 2022 తేదీలలో  నిర్వహించనున్న  ఈ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. అంతర్జాల వేదిక ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటులు, రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొంటారు.

ఆహూతుల సమక్షంలో  ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదికా, రెండు ప్రసంగ వేదికలూ ప్రత్యక్షంగానూ, అంతర్జాలం కేంద్రంగా  14 ప్రసంగ వేదికలూ, ఒక పురస్కార వేదిక వెరసి... 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వీటితో పాటు జీవన సాఫల్య పురస్కారాలను కొమరవోలు సరోజ (కెనడా), ఓలేటి పార్వతీశం (ఇండియా) కు ప్రదానం చేయనున్నారు. 

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహుకులుగా వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్), వంశీ రామరాజు (ఇండియా), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు (టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా) వ్యవహరించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top