క్యాంపస్‌ సెలెక్షన్‌లో 59 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ సెలెక్షన్‌లో 59 మంది ఎంపిక

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు హెడ్‌ కుక్‌, అసిస్టెంట్‌ కుక్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల, తెలంగాణ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌, కెరీర్‌ గైడెన్స్‌ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీజీ కాలేజీ ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో మంచి గుర్తింపునిస్తుందని, పిల్లల భవిష్యత్తును నిర్దేశించేదిగా ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగ మేళాలో 120 మందికి పైగా పాల్గొనగా శ్రీ చైతన్య కళాశాల ప్రతినిధులు నిర్వహించిన పరీక్షలో 59 మంది ఎంపికై నట్లు సమన్వయకర్త డాక్టర్‌ పి. రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ప్రతిభ, రంజిత్‌, మెంటార్‌ ఎస్‌. శ్రీకాంత్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ 5, 7వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 3,380 మంది విద్యార్థులకు గానూ 3,255 మంది హాజరు కాగా 125 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

ఖలీల్‌వాడి: జిల్లాలోని మహాత్మా జ్యోతిభా ఫూలే గురుకుల పాఠశాలలో పని చేసేందుకు మహిళ హెడ్‌ కుక్‌, అసిస్టెంట్‌ కుక్‌లు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌సీవో సత్యనాథ్‌ రెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాలోని దాస్‌నగర్‌, మునిపల్లి, వర్నిలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలకు స్థానిక ప్రిన్సిపాల్‌ లేదా ఆర్సీవో 9440423632 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement