అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు.. | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు..

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు.. హబీబ్‌నగర్‌లో చోరీ

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన ఎరుకల సత్తెవ్వ(68) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెవ్వ కొడుకు సాయిలు, కోడలు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లారు. దీంతో సత్తెవ్వ ఇంటి వద్ద ఒంటరిగా జీవిస్తోంది. సోమవారం ఉదయం కూతురు మంజూల తల్లిని చూసేందుకు వచ్చి ఇంటి తలుపులు తీసి చూడగా సత్తెవ్వ మృతి చెంది ఉన్నట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని హబీబ్‌నగర్‌లో చోరీ జరిగినట్లు ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపారు. కాలనీకి చెందిన హైమద్‌ రెండు రోజుల క్రితం శుభకార్యం నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటితాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో రూ.లక్షా 40 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement