● పెండింగ్ కేసులపై దృష్టి సారించండి
● బాసర జోన్ డీఐజీ కే నారాయణ్
నిజామాబాద్ అర్బన్ : పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని బాసర జోన్ డీఐజీ కే నారాయణ్ నాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ఆయా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సమన్లు, వారెంట్ల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కేసుల దర్యాప్తును తగిన సమయంలో పూర్తి చేసి న్యాయస్థానాల్లో త్వరగతిన చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. డీఐజీ వెంట సీపీ సాయిచైతన్య, ఏసీపీ ప్రకాశ్‌యాద వ్, ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఉన్నారు.


