23న నితిన్‌ నబీన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

23న నితిన్‌ నబీన్‌ రాక

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

సుభాష్‌నగర్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఈనెల 23వ తేదీన నిజామాబాద్‌ నగరంలో పర్యటించనున్నారని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో ఎంపీ గురువారం జూమ్‌ ద్వారా జిల్లా నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్‌ నుంచి ఆర్‌ఆర్‌ చౌరస్తా వరకు మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద బహిరంగ సభలో నితిన్‌ నబీన్‌ మాట్లాడుతారని పేర్కొన్నారు. పాదయాత్ర నిర్వహణ, సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల సమన్వయం, జన సమీకరణ తదితర అంశాలపై నాయకులకు సూచనలు ఇచ్చారు. జూమ్‌ మీటింగ్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement