బ్యాంకు ఖాతా వివరాలను బహిర్గతం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతా వివరాలను బహిర్గతం చేయొద్దు

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

● అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌

సుభాష్‌నగర్‌: ప్రజలు బ్యాంకు ఖాతా వివరాలను బహిర్గతం చేయొద్దని, ఓటీపీ, ఏటీఎం పిన్‌, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పొద్దని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) 104వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ పీ లక్ష్మీనారాయణ, బ్యాంకు సీఈవో నాగభూషణం వందే, జీఎంలు టీ అనుపమ, శ్రీనివాస్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఈఓ రక్తదానం చేయగా, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా విలువలను చాటుకున్నారు. అలాగే సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా కోర్టు చౌరస్తా, పాస్‌పోర్ట్‌ కార్యాలయం మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాజాగౌడ్‌ మాట్లాడుతూ.. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. బ్యాంకు సీఈవో నాగభూషణం వందే మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్‌డీసీసీ బ్యాంకు విశేష కృషి చేస్తుందన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు స్కూల్‌ కిట్స్‌, పండ్లు, అవసరమైన వస్తువులు అందజేశారు. అలాగే చింతకుంటలోని వృద్ధాశ్రమంలో బ్లాంకెట్లు, పండ్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. బ్యాంకు సీనియర్‌ అధికారులు గజానంద్‌, లింబాద్రి, బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement