తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

తాళం వేసిన ఇంట్లో చోరీ ఆలయంలో ..

నాగిరెడ్డిపేట: మండలంలోని చీనూర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై అగస్త్య భార్గవ్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ ప్రమీల ఈ నెల 17న ఇంటికి తాళం వేసి మెదక్‌లోని తన బంధువుల వద్దకు వెళ్లింది. గురువారం వచ్చి చూడగా తన ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న 5గ్రాముల బంగారు ఉంగరం, 3 గ్రాముల బంగారు చెవిరింగులు, 13 గ్రాముల బంగారు గుండ్లు చోరీకి గురయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

డిచ్‌పల్లి: రాంపూర్‌ ఉన్నత పాఠశాల సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయం తలుపుల తాళం పగులగొట్టిన దుండగులు స్వామి వారి వెండి కోరమీసాలు, అరతులం బంగారం తో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆలయానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement