అక్షర జ్ఞానానికి ప్రత్యేక శిక్షణ | - | Sakshi
Sakshi News home page

అక్షర జ్ఞానానికి ప్రత్యేక శిక్షణ

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

అమలు చేస్తున్నాం

ఖలీల్‌వాడి: విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను పెంపొందించేడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు తరగతుల వారీగా నిర్దేశించిన అభ్యసన సామర్థ్యాలను సాధించేలా పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. కార్యక్రమానికి లక్ష్యం అనే పేరు పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 81 కాంప్లెక్స్‌ల పరిధిలో ఉన్న 243 పాఠశాలల్లోని రెండో తరగతి విద్యార్థులకు పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి అమలు చేశారు. జిల్లాలో ‘లక్ష్యం’ కార్యక్ర మం రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ప ది రోజులపాటు పిల్లల అభ్యాస లోపాలను సరి చే యడం,రెండో దశలో విద్యాసంవత్సరం చివరి వర కు పాఠశాల స్థాయిలో నిరంతర బోధన, సందర్శన లు,సమీక్షలు కొనసాగిస్తారు. మొదటి దశలో తెలు గు, లేదా ఉర్ధూ, గణితం ఉంటాయి. మొదటి రోజు పిల్లల నైపుణ్యాలను పరీక్షించి, వారికి అవసరమైన సహాయాన్ని గుర్తిస్తారు. రెండో రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు రోజువారీ ప్రణాళిక ప్రకారం బోధిస్తారు.పదో రోజు మళ్లీ పరీక్షించి, ఇంకా నేర్చు కోవాల్సిన అంశాలను నమోదు చేస్తారు. తెలుగులో సరళ పదాలు, అక్షరధ్వనులు, గుణింత అక్షరాలు, గుణింతాలు, అంకెలను గుర్తించడం, విలువలు, నంబర్‌ను పోల్చడం, సమర్థత, సంఖ్యలో ప్రతి అంకెను గుర్తించడం నిర్వహించి, పిల్లల అవసరాలకు అనుగుణంగా బృందాలుగా మార్చి అర్థమయ్యేలా బోధన జరుగుతుంది. డీఈవో, సెక్టోరల్‌ ఆఫీస ర్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడతారు.

రెండు దశల్లో..

పది రోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత రెండో దశ క్యాంపెయిన్‌ మొదలవుతుంది. విద్యాసంవత్సరం చివరి వరకు నిరంతర సహాయం అందించడమే రెండో దశ లక్ష్యం. పది రోజుల తర్వాత ప్రతి పాఠశాల హెచ్‌ఎం కేటాయించిన అకడమిక్‌ ప్యానెల్‌ సభ్యుడితో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఏ పిల్లలకు ఏ నైపుణ్యంపై సహాయం అవసరమో, ఎవరు బోధించాలో, ఎప్పుడు పురోగతిని పరిశీలించాలో అందులో నమోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు ప్రతిరోజూ పిల్లలకు అవసరమైన బోధన అందించి, వారి పురోగతిని నమోదు చేయాల్సి ఉంటుంది. హెచ్‌ఎంలు బోధన, వర్క్‌ షీట్లు, పిల్లల పురోగతిని పర్యవేక్షించాలి. ఎంఈవోలు, సీహెచ్‌ఎంలు పాఠశాలలను సందర్శించి బోధనను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సహాయం చేయాలి. సీఆర్పీఎస్‌, అకడమిక్‌ ప్యానెల్‌ సభ్యులు మూల్యాంకనం, బోధన, తదుపరి చర్యల్లో మార్గనిర్దేశం చేస్తారు.

26 మంది అకడమిక్‌ ప్యానెల్‌ సభ్యులకు 243 పాఠశాలలను వ్యక్తిగతంగా కేటాయించారు. ప్రతి సభ్యుడు ప్రతి నెల చివరి వారంలో తనకు కేటాయించిన పాఠశాలలను స్వయంగా సందర్శించాలి. బృందాలుగా కాకుండా వ్యక్తిగతంగా సందర్శించి, గత నెల ఇచ్చిన సూచనల అమలును పరిశీలించాలి. దాని తోపాటు, స్పాట్‌ అసిస్మెంట్‌ కూడా చేయాలి.

జిల్లాలోని 81 కాంప్లెక్స్‌ల పరిధిలో 243 పాఠశాలల్లో ‘లక్ష్యం’ అమలు

పర్యవేక్షణకు 26 తనిఖీ బృందాలు

విద్యార్థులు చదవడం, రాయడంపై ప్రత్యేక దృష్టి

పది రోజుల అనంతరం అభ్యసన సామర్థ్యంపై పరీక్ష

జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి విద్యార్థులకు అక్షరాలు, గుణింతలు, అంకెల కోసం ‘లక్ష్యం’ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. దీనిని జిల్లాలో అమలు చేస్తున్నాం. తనిఖీలకు 26 మందిని నియమించాం. రెండు దఫాలుగా ఈ కార్యక్రమం ఉంటుంది. పది రోజుల్లో విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి, మెరుగుపడేందుకు చర్యలు తీసుకుంటాం.

– బాలకృష్ణ, సెక్టోరల్‌ ఆఫీసర్‌, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement