అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

● ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌రెడ్డి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

వర్ని: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం వర్ని మండల కేంద్రంలో చందూరు, మోస్రా, రుద్రూరు, కోటగిరి, పోతంగల్‌, వర్ని మండలాలకు చెందిన 621 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. నియోజకవర్గంలో 23 వేల మందికి ఇళ్లు అవసరం ఉంటే 11 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, మరో 5 వేల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 7 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తే నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. అధికారులు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంజీరా పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను అధిక ధరలకు సరఫరా చేస్తే క్వారీ ని బంధు చేయిస్తానని హెచ్చరించారు. కొందరు అధిక ధరలు వసూలు చేస్తూ ఇసుక సరఫరా చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్‌ మాజీ చైర్మన్‌ బాలరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సురేశ్‌ బాబా, సొసైటీ చైర్మన్‌ సాయి బాబా, వీర్రాజు, గోపాల్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌, నాయకులు భారీ, సర్పంచ్‌ కనకదుర్గ రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement