ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు | - | Sakshi
Sakshi News home page

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

● డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌: ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు, కాంగ్రెస్‌ ప్రభుత్వ మూడేళ్ల అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధామా? అని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ దత్తపుత్రుడిగా పేరు పొందిన ప్రశాంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీ తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రజిత యాదవ్‌, రాష్ట్ర కళ్ల గీత సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌ గౌడ్‌, మేయర్‌ ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్‌ కుమార్‌, రత్నాకర్‌ గౌడ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విపుల్‌ గౌడ్‌, యాదగిరి, లింగం, శ్రీనివాస్‌, రేవతి, బెన్సన్‌ రాజు, రాజేంద్ర ప్రసాద్‌, ఎర్రం గంగాధర్‌, అన్వర్‌, పంచరెడ్డి చరణ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అ ర్పించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement