ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన కిశోర్ గౌడ్ (52) అనే గీత కార్మికుడు బుధవారం రాత్రి తాటి చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఎస్సై సుమలత గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు వృత్తిలో భాగంగా తాటి చెట్లు గీసేందుకు వెళ్లి అదుపుతప్పి కింద పడి తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుండెపోటుతో యువకుడు..
మాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్ తండా చౌరస్తాలో ఉన్న హోటల్‌లో ఓ యువకుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఎస్సై విజయ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దేవసత్ తారక్ రామ్(40) అనే వ్యక్తి హోటల్‌లో కూర్చొని చాయి తాగుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. కొద్దిసేపటికి ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సోదరుడు మదన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పరిస్థితి విషమించి వృద్ధుడు..
నిజాంసాగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌నగర్ మండలం నడిమితండాకు చెందిన మెగ్యా(70) ఈ నెల 17న తండా సమీపంలో రోడ్డు దాటుతుండగా గూడ్స్ వాహనం ఢీకొన్నది. స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బోధన్: ప్రేమ పెళ్లి చేసుకుని రక్షణ కోసం ఓ జంట గురువారం ఎడపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సాయికుమార్, బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్ కు చెందిన జీ పూజ బోధన్ పట్టణ కేంద్రంలోని ఆ ర్యసమాజ్ లో పెళ్లిచేసుకున్నారు. అనంతరం పోలీ స్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుమారు ఎనిమిది నెలల క్రితం ఇరువు రుకి పెళ్లిచూపులు జరిగాయి. యువతి కుటుంబ స భ్యులు వివాహాన్ని నిరాకరించారు. అప్పటికే ఒకరి పై మరొకరు ఇష్టం పెంచుకుని ప్రేమను కొనసాగించారు. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.


