తెయూలో జూనియర్‌పై సీనియర్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

తెయూలో జూనియర్‌పై సీనియర్‌ దాడి

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

● బాయ్స్‌ హాస్టల్‌లో ఘటన

● బయటి వ్యక్తులతో కలిసి మాస్కులు

ధరించి ఐరన్‌ రాడ్‌లతో వచ్చిన విద్యార్థి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌క్యాంపస్‌ ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి జూనియర్‌ విద్యార్థిపై సీనియర్‌ విద్యార్థి కొందరు బయట వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. వర్సిటీ అధికారులు, హాస్టల్‌ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం రూప్లానాయక్‌ తండాకు చెందిన బదావత్‌ సంజీవ్‌ తెయూ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ (ఐదు సంవత్సరాల కోర్సు)లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన గువ్వల విష్ణువర్ధన్‌ తెయూ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ (ఐదు సంవత్సరాల కోర్సు) రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇరువురి మధ్య జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న సంజీవ్‌ గురువారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు బయటి వ్యక్తులు ఎనిమిది మందిని హాస్టల్‌కు రప్పించాడు. ముఖాలకు మాస్కులు ధరించి చేతుల్లో రాడ్లు, కర్రలు పట్టుకొని హాస్టల్‌లోకి చొరబడ్డారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న విష్ణువర్ధన్‌కు ఇతర వి ద్యార్థులు సాయం రాకుండా ఉండేందుకు వారి గ దుల తలుపులకు బయట నుంచి గడియపెట్టారు. ఆ తర్వాత విష్ణువర్ధన్‌ గదిలోకి చొరబడి దాడికి పా ల్పడ్డారు. అదే గదిలో ఉన్న అతడి స్నేహితుడిపై సై తం దాడి చేశారు. విష్ణువర్ధన్‌ వెంటనే కేకలు వేస్తూ బయటికి రావడంతో పైఅంతస్తుల్లో ఉన్న విద్యార్థులు మేల్కొని వచ్చారు. దీంతో దాడికి పాల్పడిన వారు పారిపోయారు. దాడికి పాల్పడిన వారిలో సంజీవ్‌ను గుర్తించిన బాధితుడు వెంటనే హాస్టల్‌ వార్డెన్‌ కిరణ్‌కుమార్‌ రాథోడ్‌కు తెలిపారు. హాస్టల్‌కు చేరుకున్న వార్డెన్‌ దాడి విషయాన్ని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరితోపాటు చీఫ్‌ వార్డెన్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డి, డిచ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన బాధితుడిని డిచ్‌పల్లి ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాధితుడు హాస్టల్‌కు చేరుకున్నాడు. పోలీసులు హాస్టల్‌కు చేరుకొని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

హాస్టల్‌ విద్యార్థులతో రిజిస్ట్రార్‌ సమావేశం

రిజిస్ట్రార్‌ ఎం.యాదగిరి శుక్రవారం అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. బాధిత విద్యార్థితోపాటు తోటి విద్యార్థుల తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వర్సిటీ నుంచి బయటికి పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గతంలోనూ బెదిరింపులు?

ఘటనకు పాల్పడిన సీనియర్‌ విద్యార్థి సంజీవ్‌ గతంలోనూ జూనియర్‌ విద్యార్థులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. 4 నెలల క్రితం జూనియర్‌ విద్యార్థిని లోకల్‌, నాన్‌ లోకల్‌ పేరిట బెదిరించాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో జోక్యం చేసుకున్న చీఫ్‌ వార్డెన్‌, సంజీవ్‌ను పిలిపించి గట్టిగా మందలించారు. క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తన పద్ధతి మార్చుకోకుండా ఈసారి ఏకంగా బయటి వ్యక్తులను రప్పించి తోటి విద్యార్థిపై దాడి చేయించడం క్యాంపస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement