సుభాష్‌నగర్: నగరంలోని పవర్‌హౌస్ కంపౌండ్, అర్సపల్లి, మిర్చి కంపౌండ్ సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా రెండో శనివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–1 ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిలక్‌గార్డెన్, దుబ్బ సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలోని ఏరియాల్లో సరఫరా నిలిపేస్తున్నామన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
నేటి నుంచి జాతీయ
గ్రంథాలయ వారోత్సవాలు
ఖలీల్‌వాడి: జిల్లా గ్రంథాలయ సంస్థలో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, కార్యదర్శి టి. శ్రీలత శుక్రవారం తెలిపారు. వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వివిధ రకా ల పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు.
అగ్నిమాపక శాఖ జిల్లా నూతన కార్యవర్గం
నిజామాబాద్‌అర్బన్: జిల్లా అగ్నిమాపక శాఖ అత్యవసర సేవల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి వంశీకృష్ణారెడ్డి (బోధన్), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్ గౌడ్, సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా రంజిత్ (బాల్కొండ), సంయుక్త కార్యదర్శిగా సురేశ్ (నందిపేట్), కే సురేందర్ (నిజామాబాద్), కోశాధికారిగా సాయిలు (నిజామాబాద్), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఏసురత్నం (నిజామాబాద్) ఎన్నికయ్యారు. జిల్లా నుంచి రాష్ట్ర తాత్కాలిక కార్యవర్గంలో కూడా పలువురికి కీలక బాధ్యతలు కల్పించారు. రాష్ట్ర సలహాదారుగా దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా ఆనంద్, కోశాధికారిగా కృష్ణ ఎన్నికయ్యారు.
మాతృ మరణాలను తగ్గించాలి
నిజామాబాద్‌అర్బన్ : మాతృ,శిశు మరణాల ను తగ్గించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అ ధికారి రాజశ్రీ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం మాతృ, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. దుబ్బ, కల్లెడి, అర్సపల్లి ఆరోగ్య కేంద్రాలకు చెందిన సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసవాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రమాదకర లక్షణాలు ముందుగానే గుర్తించి పైఆస్పత్రులకు రిఫర్ చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు విద్యా, అశోక్, శివశంకర్, డాక్టర్ సుస్మిత, ఉమా, కీర్తి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


