మహిళా భవనాలు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

మహిళా భవనాలు ముస్తాబు

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

జిల్లాలో నిర్మాణాల ప్రగతి

జిల్లాలో నిర్మాణాల ప్రగతి

● 19న ప్రారంభించేందుకు సన్నాహాలు

● చివరి దశలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు

పూర్తయినవి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గ్రామ సమాఖ్య (వీవో) మహిళా భవనాలను ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేర కు జిల్లాలో నిర్మాణం చివరి దశలో ఉన్న భవనాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించి సిద్ధంగా ఉంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు మండలాల వారీగా భవనాల నిర్మాణ ప్రగతి వివరాలను సేకరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 65 భవనాల జాబితాను సిద్ధం చేసిన అధికారులు, ఫొటోలను సైతం పైస్థాయి అధికారులకు పంపించారు. అధికారిక ఉత్తర్వులు రాగానే ప్రారంభోత్స వాలకు ఏర్పాట్లు చేసేందుకు యంత్రాంగం సన్న ద్ధం అవుతోంది. వీబీజీ రామ్‌జీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 363 భవనాలు మంజూరయ్యాయి. ఒ క్కో భవనానికి రూ. 10 లక్షల చొప్పున నిధులను కేటాయించింది. అయితే ఇందిరా గాంధీ జయంతి రోజునే మహిళలకు చీరలను పంపిణీ చేసే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

65

వివిధ

దశల్లో ఉన్నవి

13ఏఆర్‌ఎం101–250038–

అసలు

ప్రారంభం

కానివి

68

230

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement